TRINETHRAM NEWS

Trinethram News : ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు రూపకల్పన చేసి బాపట్ల సత్తా చాటారు సుప్రసిద్ధ ఇంజనీర్ నోరి గోపాలకృష్ణమూర్తి. బాక్రానంగల్ డ్యాం, కోయిన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వంటి పలు ప్రాజెక్టులకు ఆయన రూపశిల్పిగా ఉన్నారు. 1963 లో పద్మశ్రీ ,1972లో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.బాపట్లలో జన్మించి, బాపట్ల బోర్డు స్కూల్లో విద్యాభ్యాసం చేసి అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి కీర్తి పతాకాన్ని ఎగురవేశారు ఆయన. ఇంటర్నేషనల్ లార్జ్ డ్యామ్స్ కాంగ్రెస్ కు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు నోరి. ఇండో బాంగ్లాదేశ్ జాయింట్ రివర్ కమిషన్ చైర్మన్ గా వ్యవహరించారు. ఎన్నో ఇంజనీరింగ్ అద్భుతాలను ఆవిష్కరించి, చరితార్థులయ్యారాయన. నేటితరం ఆయన్ను ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నోరి గోపాలకృష్ణమూర్తి 114వ జయంతి సందర్భంగా శుక్రవారం ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో పటేల్ నగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫో రం కార్యదర్శి డాక్టర్ పి సి సాయిబాబు, పోస్ట్ మాస్టర్ రాంబాబు, పురపాలక ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సునీత, ఉపాధ్యాయులు సాంబయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.