![IMG 20250129 WA0021](https://trinethramnews.in/wp-content/uploads/2025/01/IMG-20250129-WA0021.jpg)
రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పాల్గొన్న శాసనసభాపతి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) లోని కాలేజీ ఆడిటోరియంలో జరిగిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్న రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి ప్రకాష్ గౌడ్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్ధాసు జానయ్య, అధ్యాపకులు, సిబ్బంది.ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రసంగిస్తూ.వ్యవసాయ పరిశోధనలలో దేశ, విదేశాలలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిధ్యాలయం పేరొందడం తెలంగాణ వాసులందరికి గర్వకారణం, తెలంగాణాతో పాటుగా దేశంలోని రైతులకు ఉపయోగపడడం గర్వకారణం.
వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ఇప్పటి వరకు 67 రకాల అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేయడం, దేశంలో సాగవుతున్న వరి వంగడాలలో 25 శాతం మన యూనివర్సిటీ రూపొందించినవే శాస్త్రవేత్తల అంకితభావానికి ప్రతీక.తాండూరు కందికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిధ్యాలయం కీలక పాత్ర పోషించడం నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషం కలిగించింది.
వ్యవసాయ రంగంపై అపార అనుభవం కలిగిని ప్రొఫెసర్ అల్ధాస్ జానయ్య ఆద్వర్యంలో వ్యవసాయ విశ్వవిధ్యాలయం పరిశోధనలలో మరింతగా పేరు తెచ్చుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధికంగా ప్రాముఖ్యత ఇస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రైతు బిడ్డ, వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో పూర్తిగా తెలిసిన వ్యక్తి. ప్రజా ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే వ్యవసాయ రంగానికి రాష్ట్ర బడ్జెట్ లో యాబై వేల కోట్లను ఖర్చు చేసింది. రైతులను రుణ బారం నుండి విముక్తులను చేయడానికి 25 లక్షల మంది రైతులకు చెందిన 21 వేల కోట్ల రుణాలను మాఫీ చేయడం జరిగింది.
రైతు భరోసా ను ఏడాదికి ఎకరాకు 12 వేలకు పెంచడం జరిగింది, రైతు బీమా, సన్న రకాల వడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్, వ్వవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. రైతులకు ఏమేమి కావాలో అన్నింటికి కూడా ప్రభుత్వ సహకారం అందిస్తుంది.
వ్యవసాయాన్ని ప్రొఫెషన్ గా తీసుకున్నందుకు మీ అందరిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. మీరు మంచి శాస్త్రవేత్తలుగా ఎదిగి వ్యవసాయ రంగం అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను.స్వరాష్ట్రం వచ్చాక తెలంగాణ బంగారు తెలంగాణ అవుతది అనుకుంటే ఒక కుటుంబం చేతిలో బందీ అయింది. తెలంగాణ వచ్చాక ఒక్క కుటుంబమే బాగుపడింది. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు. రాష్ట్ర ప్రజలు మార్పుకోరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేద్దామంటే ఏడు లక్షల కోట్ల అప్పు, నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ కట్టాల్సిన పరిస్థితి. వడ్డీ డబ్బులు మిగిలినా అన్ని పథకాలు అమలు చేసేవాళ్ళం.
పరిస్థితులు చక్కదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేస్తున్నారు. పరిస్థితులు సరిదిద్దుతూ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. పరిస్థితిని ప్రజలకు తెలియజేస్తే అర్ధం చేసుకుంటున్నారు.గత పదేళ్ళుగా విశ్వవిద్యాలయాలకు నిధులు, నియామకాలు లేవు.
యూనివర్సిటీకి చెందిన భూములను రక్షించాలి, ఆక్రమణలను తొలగించాలి. యూనివర్సిటీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళుతాను. విశ్వవిద్యాలయం పేరు ప్రతిష్టలు పెంచే విదంగా అందరం కృషి చేద్దాం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![](https://trinethramnews.in/wp-content/uploads/2025/01/IMG-20250129-WA0021-838x1024.jpg)