
Trinethram News : చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఒక వ్యక్తిని పాములు పగబట్టి కాటేస్తున్నాయా లేదంటే ప్రమాదవశాత్తు పాములుకాటుకు గురి అవుతున్నాడా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది
బైరెడ్డిపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కొంటున్నాడు
ఇలా వింత సమస్యతో సతమతం అవుతున్నాడు. పాము కాటుకు గురై మృత్యుంజయుడిగా మారాడు. వినడానికి కాస్త వింతగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నా.. సుబ్రమణ్యం ఇప్పటివరకు 103 సార్లు పాము కాటుకు గురయ్యాడు.. అవును అన్ని సార్లు కూడా పాము కాటుకు గురై.. ఆసుపత్రి పాలై చికిత్స పొందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు
18 ఏళ్ల వయసులో కర్ణాటక రాష్ట్రంలో నివాసము ఉంటూ తొలిసారి పాముకాటుకు గురైన సుబ్రహ్మణ్యం.. అయితే ఏ సర్ప దోషం ఉందో తెలియదు కానీ పాములు మాత్రం అతనిపై పగతో రగిలి పోతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
