TRINETHRAM NEWS

A little reckless driving can put a family’s future on the road

రామగుండం పోలీస్ కమిషనరేట్

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల డ్రైవర్స్ గా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి అవగాహన

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

చిన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్ కుటుంబ భవిష్యత్తు ను రోడ్డు పాలు చేస్తుంది

ఈరోజు రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో, అధికారుల వద్ద డ్రైవింగ్ విధులు నిర్వహిస్తున్న 50 మంది సిబ్బందికి రామగుండం కమిషనరేట్ లో డ్రైవర్స్ కి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమం కి రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్,(ఐజి) ముఖ్య అతిథిగా వచ్చి డ్రైవర్స్ కి పలు సూచనలు, సలహాలు, జాగ్రత్తలు తెలపడం జరిగింది
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లకు ఆదేశించినారు. పోలీసు అధికారుల ఆధీనంలో ఉన్న వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సొంత వాహనంలా మంచి కండిషన్లో ఉంచి ఎప్పటికప్పుడు సర్వీసింగ్, ఇంజన్ ఆయిల్, టైర్ల నిర్వహణ చూడాలన్నారు రోడ్డు ప్రమాదాల వలన 1,69,000 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 4 లక్షల మంది క్షతగాత్రులు అయ్యారు. ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుంది అన్నారు. కాబట్టి ఒక చిన్న నిర్లక్ష్యపు కారణం వలన ప్రమాదం సంభవించి వారి కుటుంబ భవిష్యత్తు రోడ్డు పాలవడం జరుగుతుందన్నారు
వాహనంలో కూర్చొని ప్రయాణించునపుడు అలర్టుగా వుండి, పరిసరములు నిశితముగా గమనిస్తూ ముందుకు వెళ్ళవలెను
డ్రైవర్ లు విశ్రాంతి సమయంలో విశ్రాంతి తీసుకోకుండా అనవసరంగా సమయం వృధా చేసుకొని వాహనం నడుపు సమయం లో ఇబ్బందిగా వాహనం నడపకూడదు
ఏలాంటి ఆనందమైన విషయం ఐనా, సంతోకరమైన విషయం ఐనా, బాధ కరమైన లేదా ఎలాంటి సమస్య ఉన్న వాహనం ఎక్కేవరకే ఉంచాలి. ఒక్కసారి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాక పూర్తి స్థాయిలో ద్రుష్టి డ్రైవింగ్ పైనే ఉండాలి లేకపోతే ఏదో ఆలోచనలో ఉండి వాహనం ప్రమాదానికి గురై అవకాశం ఎక్కువ
వాహనం నడిపేసమయంలో సెల్ ఫోన్ లో మాట్లాడటం, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించటం చేయరాదు. వాహనం ని ఇష్టనుసారంగా ఆపి, నిర్లక్ష్యంగా కూర్చొని పరిస్థితులు, పరిసరాలు గమనించకుండా,సెల్ ఫోన్ చూడటం లో కాని, పేపర్ చదవడం లో గాని నిమగ్నం కాకూడదు
సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి అదే విధంగా అధికారులకు కూడా తప్పనిసరిగా పెట్టుకునే విధంగా చెప్పాలి
అందరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ప్రజలకు పోలీసులు ఆదర్శంగా ఉండాలి
ట్రాఫిక్ రూల్స్ పాటించకుండ పోలీస్ ప్రతిష్ట కి భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తే శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు
ఏదైనా ఆరోగ్య,కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు అధికారులకు తెలియ చేయాలి మీ స్థానంలో వేరొక డ్రైవర్ ని పంపడం జరుగుతుంది. చెప్పకుండా డ్రైవింగ్ కష్టపడుతూ చేయడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ ఎం.టి.ఓ మధు,ఆర్ఐ మల్లేశం, శ్రీనివాస్, రామగుండం ఎం వి ఐ మధు,ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A little reckless driving can put a family's future on the road