TRINETHRAM NEWS

Trinethram News : ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ జనసేన కలిసి భారీ సభ నిర్వహించనున్నట్లు టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నయుడు పేర్కొన్నారు. గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయ చరిత్రలోనే చరిత్రాత్మక ఘట్టానికి ఓ వేదిక అవుతుందన్నారు. ఆ సభలో సూపర్ సిక్స్ కు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్లు ఆయన తెలిపారు.