TRINETHRAM NEWS

12 అంతస్తుల హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 66 మంది మృతి..పలువురికి గాయాలు..

Trinethram News : Turkiye : 12 అంతస్తుల హోటల్ భవనంలో తెల్లవారుజామున 3:30 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 51 మందికి గాయాలైనట్లు మంత్రి అలీ వెల్లడించారు. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 234 మంది గెస్ట్‌లు ఉన్నట్టుగా సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

టర్కీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ట‌ర్కీలోని స్కీయింగ్ రిసార్టు హోట‌ల్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో 66 మంది సజీవదహనమయ్యారు. పలువురు గాయపడినట్లు సమాచారం. హుటాహుటినా రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మంటల్లో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

12 అంతస్తుల హోటల్‌లోని నాల్గవ అంతస్తులో మంటలు చెలరేగాయని బోలు గవర్నర్ అబ్దుల్ అజీజ్ ఐడిన్ తెలిపారు. తెల్లవారుజామున 3:30 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 51 మందికి గాయాలైనట్లు మంత్రి అలీ వెల్లడించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App