![IMG 20250129 WA0030](https://trinethramnews.in/wp-content/uploads/2025/01/IMG-20250129-WA0030.jpg)
మీర్ తాహేర్ అలి కి ఆత్మీయ సన్మానం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి, మున్సిపల్ కౌన్సిలర్ల పదివి కాలం ముగియడంతో 14 వార్డులో విశేష సేవలు అందించిన మీర్ తాహేర్ అలి కి పరిగి మున్సిపల్ పరిధి బిసి కాలని మందుల సంఘం సభ్యులు ఆత్మీయ సన్మాన కార్యక్రమంను నిర్వహించి శుభాకాంక్షలు తెలుపారు. ఈ సందర్భంగా మందుల సంఘం సభ్యులు మాట్లాడుతూ మీర్ తాహేర్ అలి కౌన్సిలర్ గా చేసిన సేవలను అభినందిస్తూ..
కాలనీలో ఏ సమస్య ఎదురైన తక్షణమే స్పందిచారని, కొవిడ్ సమయంలో కాలని వాసులకు అన్ని విధాల ఆదుకున్నారని, అలాగే వర్షాకాలంలో కాలవలు నిండి తమ ఇండ్లలో చేరినప్పుడు దగ్గర వుండి సహాయం చేశారని, త్రాగునీటి సమస్య ఏర్పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, మెుగులయ్య, బాల్ రాజ్, శ్రీను, శ్రీకాంత్, సంజీవ్, మహేష్, మహ్మద్ అలీ, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు*
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![](https://trinethramnews.in/wp-content/uploads/2025/01/IMG-20250129-WA0030-1024x497.jpg)