TRINETHRAM NEWS

500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణి.

అల్లూరిజిల్లా అరకువేలి. త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 4: అరకులోయ మండల కేంద్రంలోని శారద నికేతన్ పాఠశాలలో శారద ట్రస్టు ఆధ్వర్యంలో కృష్ణా మేటర్నటీ నర్సింగ్ హోమ్ మరియు కృష్ణా చిల్డ్రన్స్ హాస్పటల్ విశాఖపట్నం సంయుక్తంగా బి ఎల్ నారాయణ, జనరల్ మేనేజింగ్ డైరెక్టర్ వరలక్ష్మి సహకారంతో గురువారం చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.ఈ మెడికల్ క్యాంపుకు విద్యార్దులు,గిరిజనులు సుమారు 500 పైగా హాజరయ్యారు.వారికి డాక్టర్ బి తేజస్విని, డాక్టర్ వై దివ్య, డాక్టర్ పైల సంధ్య వివిధ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.వ్యాధులతో బాధపడుతున్న వారిని బిపి, షుగర్, గైనిక్ చెకప్,రక్తపరీక్ష, చేసి మందులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు మాట్లాడుతూ.నీరు పేద,మధ్య తరగతి గిరిజన కుటుంబీలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు.ఈ యొక్క ఉచిత మెగా వైద్య శిబిరానికి సుమారు లక్ష రూపాయలు వెచ్చించి ఖరీదైన మందులు ఇవ్వడం జరిగిందన్నారు.ఇలాంటి ఉచిత వైద్య శిబిరానికి గిరిజనులు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజా వేదిక నాయకురాలు జె రాజ్యలక్ష్మి,శారద ట్రస్ట్ సభ్యులు రత్నం, ఐద్వా రాష్ట్ర నాయకురాలు వి.వి జయ.శారదా నికేతన్ ప్రిన్సిపల్ చిరంజీవి,వైద్య సిబ్బంది,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

free mega medical camp