
తేదీ : 14/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరంలో మావుళ్ళమ్మ అమ్మవారి 61 వ మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించడం జరిగింది. ఉదయం 7 గంటల 35 నిమిషాలకు ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల.
మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలను చేపట్టగా ఎమ్మెల్యే అంజి బాబు దంపతులు మహా నివేదికకు హారతులు ఇచ్చి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు వేలాదిగా తరలి రావడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
