TRINETHRAM NEWS

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

చొప్పదండి పట్టణం కు చెందిన మావురపు వేణు గోపాల్ ఇటీవల నిర్వహించిన డీ.ఎస్సీ లో స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం పొందడం జరిగింది. గతం లో నిర్వహించిన డీ.ఎస్సీ లో రెండు సార్లు ప్రయత్నం చేసినా ఒకసారి హాఫ్ మార్కు తేడాతో మరొక సారి స్వల్ప తేడాతో ఉద్యోగం మిస్ అవడం జరిగింది.ఐనా కూడా మొక్కవోని పట్టుదలతో ఇటీవలే నిర్వహించిన డీ. ఎస్సీ లో ఉద్యోగం పొందడం జరిగింది.ఈ సందర్భంగా యువ నాయకులు మావురపు మహేష్ ఆధ్వర్యం లో ఘన సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో దీకొండ రమేష్,సామనపెల్లి సుధాకర్,రాజు ,వెంకట రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App