ఘనంగా పదవ తరగతి విద్యార్థులు కు వీడ్కోలు
తేదీ : 07/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజవర్గం, విస్సన్నపేట మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ గిరిజన రెసిడెన్షియల్ బాలుర పాఠశాల యందు 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, వారి సిబ్బంది , పాఠశాల చైర్మన్ , వైస్ చైర్మన్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కలిగివుండి బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని అందరు కూడా సోదరీ భావంతో మెలిగి ఉండాలి, ముఖ్యంగా 9 మరియు 10వ తరగతి విద్యార్థులు , 5వ తరగతి నుండి ప్రతి ఒక్కవిద్యార్థి కూడా మంచి అలవాట్లతో క్రమశిక్షణ పాటించి బాగా చదవాలని సూచించడం జరిగింది.
ప్రతిరోజు కూడా ప్రభుత్వం ఇచ్చిన సమయం ప్రకారం విద్యార్థులకు తరగతులు మరియు స్టడీ అవర్స్ ప్రభుత్వం ఇచ్చిన సమయంలోనే జరుగుతున్నాయి. ప్రధానంగా పబ్లిక్ పరీక్షలు దగ్గర రావడంతో పదవ తరగతి విద్యార్థులకు స్పెషల్ తరగతులు నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులను ప్రేమ ఆప్యాయత తో చూసుకోవడం జరుగుతుంది. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బందిని వారు చెప్పే పాఠాలకు మరియు, విద్యార్థులను చూసుకునే విధానాన్ని.
మెచ్చుకోవడం జరిగింది. పదవ తరగతి చదువే విద్యార్థులు జ్ఞానం తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థులకు కలగాలని కొవ్వొత్తులు వెలిగించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. విద్యార్థులు మంచిగా డాన్సులు , వేసి అందరిని అలరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రమేష్, వైస్ చైర్మన్ రోజా ప్రధానోపాధ్యాయులు వై రత్నాకర్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App