
నిత్య జీవిత సమస్యలకు పరిష్కారాలు
అందుబాటులోకి వచ్చిన యాప్ సేవలు
Trinethram News : Andhra Pradesh : నిద్ర లేచింది మొదలు నిత్యం అనేక సమస్యలు సగటు నగర, పట్టణ వాసిని వేధిస్తుంటాయి. పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ఉరుకుల పరుగుల జీవనంలో కార్యాలయాల చుట్టూ తిరిగే సమయం లేక సతమతమవుతుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఇంటి నుంచి కాలు కదపకుండానే పరిష్కరించుకునేందుకు ఓ మిత్రుడిలా సహకారం అందిస్తుంది పురమిత్ర యాప్. పుర, నగరపాలక సంస్థలతో ముడిపడిన సమస్యల నుంచి గట్టెక్కేలా ప్రజల చేతికి ప్రభుత్వం ఈ మిత్రుడిని సహాయకారిగా అందించింది.
సమస్త సేవలు ఇక అరచేతిలోనే..
మొత్తం 119 రకాల సేవలు: తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ఇళ్లలో చెత్త సేకరణ, ఇంటి పన్ను చెల్లింపు, భవన నిర్మాణ అనుమతులు, ఆక్రమణలు, ప్రజారోగ్యం, దోమలు, కుక్కల బెడద, రహదారులపై గుంతలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, కుళాయిల ఏర్పాటు, పేదరిక నిర్మూలనకు సంబంధించిన పథకాలు వంటివి మొత్తం 119 రకాల సేవలు అందుతాయి.
పౌరులెవరైనా ప్లే స్టోర్ నుంచి పురమిత్ర యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ తర్వాత మన మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే, వచ్చే ఓటీపీ ద్వారా యాప్‌లోకి ప్రవేశించవచ్చు. అనంతరం మన మున్సిపాలిటీని ఎంచుకొని యాప్ ద్వారా మొబైల్‌లో టైప్ చేసి సందేశంగా పంపొచ్చు. లేకుంటే వాయిస్ రూపంలోనూ పంపేందుకు అవకాశం ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
