TRINETHRAM NEWS

రామగుండం పోలీస్ కమిషనరేట్

ఉద్యోగ విరమణ పొందుతున్న హోంగార్డ్ లకి సీపీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పోలీస్ శాఖలో గత 43 సం,, లుగా హోం గార్డ్ గా జె. ఓదెలు హోం గార్డ్ నంబర్ .288, 20 సంవత్సరాలు గా టి. సత్తమ్మ మహిళా హోం గార్డ్ -795, 28 సంవత్సరాలుగా, పి. లక్ష్మి మహిళ హోం గార్డ్ -146, విధులు నిర్వహించడం జరిగింది. ఇట్టి హోంగార్డ్ లు ఈ రోజు ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్బంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, ఐపీఎస్ (ఐజీ) కమీషనర్ కార్యాలయంలో వారిని పూలమాల వేసి, శాలువా తో సత్కరించి జ్ఞాపిక ను అందచేయడం జరిగింది.

ఈ కార్యక్రమం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సుందర్ రావు, ఏ. ఓ శ్రీనివాస్, ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్, వామన మూర్తి మల్లేశం, సంపత్ లు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App