TRINETHRAM NEWS

సర్వం కోల్పోయి అనాధలైన వైనం.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా కొయ్యూరు లో గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో, వంజరి ఆంజనేయులు పూరిల్లు దగ్ధం అయింది. భారీగా ఎగిసిపడిన మంటలు కారణంగా గ్రామస్తులు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ, సాధ్యం కాని పరిస్థితి. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో అనాధలుగా మిగిలిన కుటుంబం. ఇల్లు తగలబడుతున్న సమయంలో తల్లి నలుగురు పిల్లలు మంటల్లో చిక్కుకున్న వారిని గ్రామస్తులు బయటకు తీసుకువచ్చారు.

బాధిత యజమాని వంజరి ఆంజనేయులు మాట్లాడుతూ, పది బస్తాల తిండి గింజలు, 50 వేల రూపాయల నగదు, రెండు తులాలు బంగారం, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు,వంట సామాగ్రి, మరియు బట్టలు సర్వం కాలిపోయి కట్టుబట్టలతో ప్రమాదం నుంచి తప్పుకున్నట్లు తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన కారణాలు వివరాలు స్థానిక విఆర్ఓ నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A family escaped