
తేదీ : 26/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, డైనమిక్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఉదయాన్నే బయలుదేరి పల్నాడు జిల్లా, కోటప్పకొండ మీదున్న మహాశివరాత్రి వేడుకలలో పాల్గొనడం జరిగింది. మహాశివుడు ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామస్థాయి నుండి దేశ స్థాయి వరకు ప్రతి ఒక్కరి కుటుంబంలో కష్టనష్టాలు లేకుండా, వారు చేసే వృత్తులలో ధన లాభం సమకూరి సుఖ సంతోషాలతో వాళ్లు జీవితాలు గడపాలని తెలిపారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి కుటుంబంలో వె లుగులు నిండాయని తెలిపారు. భక్తులకు కమిటీ వారు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసుకోవడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
