ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల లోకాయుక్తకు ఒకే వెబ్ సైట్ ఉండగా..
ఏపీకి ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి వెల్లడించారు.
ఏపీ లోకాయుక్త వెబ్సైట్ lokayukta.ap.gov.in ను ఆయన ప్రారంభించారు.
లోకాయుక్త సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి సూచించారు.
లోకాయుక్త కు సంబంధించి నియమ నిబంధనలు, ఇతర వివరాలు వెబ్ సైటులో ఉంటాయన్నారు.