మద్యం మత్తులో తోటి హోంగార్డ్ పై కానిస్టేబుల్ దాడి?
Trinethram News : Andhra Pradesh : విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై మద్యం మత్తులో ఉన్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ విచక్షణా రహితంగా లాఠీతో దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటన ఏపీలోని పల్నా డు -మాచర్లలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నైట్ బీట్ నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీనివాస్ వద్దకు కానిస్టేబుల్ మల్లిఖార్జున పీకలదాకా మద్యం తాగి వచ్చి అకారణంగా అతనిపై దాడికి పాల్పడినట్లు సమాచారం.
బాధిత హోంగార్డు వద్దని వారిస్తున్నా వినకుండా కానిస్టేబుల్ మల్లిఖార్జున కర్రతో అతని మీద దాడి చేశాడు.దీనికి సంబంధిం చిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పట్టణ సీఐ తెలిపారు
కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App