
ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని వెంటనే నిర్మించాలి : జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 6 : ఈరోజు కెపిహెచ్బి కాలనీ 5వ పేస్ లో ప్రభుత్వం ఆసుపత్రికై కేటాయించిన 1.72 ఎకరాల స్థలములో వెంటనే వంద పడకల ఆసుపత్రి నిర్మించాలని కూకట్ పల్లి జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జన శ్రేణులతో కలిసి ఆసుపత్రికై కేటాయించిన స్థలం వద్దకు ప్లకార్ట్స్ పట్టుకుని నిరసన తెలియజేస్తూ ర్యాలీగా వెళ్లారు.ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి నివసిస్తూ ఉన్న సుమారు 4, 5 లక్షల జనాభాకు రోగాలు వస్తే ఆదుకోవడానికి ఆసియాలోనే పెద్ద కాలనీ అని గొప్పగా చెప్పుకునే కెపిహెచ్బి కాలనీలో ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని ,పేద మరియు మధ్యతరగతుల ప్రజలకు రోగాలు వస్తే ప్రభుత్వ ఆసుపత్రి లేనందున ప్రవేట్ ఆసుపత్రి చికిత్స కై వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని,
కూకట్ పల్లి నియోజకవర్గం లో భవన నిర్మాణ కార్మికులు ,వాచ్మెన్లు , చిరు వ్యాపారస్తులు , చిన్న చిన్న ప్రైవేటు సంస్థలలో పనిచేసుకునేవారు, రిక్షా కార్మికులు , జిహెచ్ఎంసి కార్మికులు, ఇండ్లలో పని చేసుకునేవారు ఉన్నారని వారిని ఆరోగ్యపరంగా ఆదుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యతని , గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2023 లో శిలాఫలకం తో శంకుస్థాపన చేసి 9 నెలలలో ఆసుపత్రిని నిర్మిస్తామని స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి హరీష్ రావు ప్రజలను మభ్యపరిచారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్య ధోరణి చేస్తున్నారని , ఈ ఆసుపత్రి స్థలము కబ్జాకి గురి అవుతుందని అన్నారు.పేదలకు కేటాయించిన ఈ ఆసుపత్రి స్థలాన్ని కబ్జా చేసినా , ప్రభుత్వం అమ్ముకుంటామన్నా జనసేన పార్టీ ఊరుకోదని ,ప్రజల తరఫున తాము పోరాడుతామని , అవసరం అయితే నిరాహార దీక్ష చేస్తామని ఈ సమస్యను తాను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్లు డివిజన్ , ప్రెసిడెంట్లు జనసేన పార్టీ నాయకులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
