
Congratulations New Registrar : కూకట్ పల్లి జూన్ 22 (త్రినేత్రం న్యూస్) : జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నూతనంగా నియమితులైన రిజిస్ట్రార్ డాక్టర్ ఏ. జయలక్ష్మి, రెక్టార్ డాక్టర్ ఏ. దామోదరంను నవ తెలంగాణ విద్యార్థి శక్తి రాష్ట్ర అధ్యక్షుడు ఈ. పవన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జయలక్ష్మి, డాక్టర్ దామోదరం దంపతులను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
విశ్వవిద్యాలయ అభివృద్ధికి వారి సేవలు ఎంతో ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అనంతరం పవన్ కుమార్ మాట్లాడుతూ జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదల, పరిపాలనా సేవల సులభతరం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
త్వరలోనే జేఎన్‌టీయూహెచ్‌లో నవ తెలంగాణ విద్యార్థి శక్తి నూతన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తమ సంస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీవీఎస్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నితిన్ రెడ్డి, రమణ, సుశాంత్, శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe