
దేవరకొండ డివిజన్ జూన్ 15, త్రినేత్రం న్యూస్. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొదటి రోజే విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి విద్యుత్ ఘాతానికి గురికావడం స్థానికులను కలిచి వేసింది.
సోమవారం రోజు మొదటి రోజు పాఠశాల ప్రారంభం కావడంతో ఉపాధ్యాయులు పాఠశాల గేటు వద్ద మామిడి తోరణాలు కడుతుండగా సహాయం కోసం పక్కనే ఆడుకుంటున్న ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి నాంపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన జ్యోతి ,శంకర్ ల కుమారుడు రాంచరణ్ (13) పిలవగానే ఆ విద్యార్థి గేట్ పైకి ఎక్కి మామిడి తోరణాలు కడుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగను పట్టుకోగా విద్యుత్ ఘాతానికి గురయ్యాడు.
దీంతో విద్యార్థి అపస్మారక స్థితిలో పడిపోవడం గమనించిన ఉపాధ్యాయులు హుటా హుటీనా దేవరకొండ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. పాఠశాల మొదటి రోజే ఈ ప్రమాదం జరగడంతో బాలుడి తల్లిదండ్రులు స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe