
Cricket Tournament : డిండి(గుండ్ల పల్లి) జూన్ 08, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో డీ సి సి క్లబ్ వద్ద… నిర్వహించినటువంటి క్రికెట్ టోర్నమెంట్ అనూష ప్రాజెక్ట్ ప్రైవేట్ కంపెనీ చైర్మన్ అండపల్లి జలంధర్ రెడ్డి సహకారంతో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ డిండి మండల కేంద్రంలోని డిండి క్రికెట్ క్లబ్ మైదానంలో గత 10 రోజుల నుండి 50 క్రికెట్ టీంలు టోర్నీలో పాల్గొన్నాయి. సోమవారం నిర్వహించిన ఫైనల్ మ్యాచ్లో డిండి క్రికెట్ క్లబ్ మరియు ఎడ్లగడ్డతండా క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ (ఆటలో) మొదట టాస్ గెలిచిన ఎడ్లగడ్డ తండా టీం కెప్టెన్ మూడావత్ ప్రవీణ్ బ్యాటింగ్ ఎంచుకొన్నారు.
అనంతరం జరిగిన నిర్థిస్ట 12 ఓవర్ల మ్యాచ్లో 8 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేశారు.తరువాతి ఇన్నింగ్ బ్యాటింగ్ కు దిగిన డిసిసి జట్టు 12 ఓవర్లు పూర్తి చేసుకొని కేవలం 82పరుగులు మాత్రమే చేసింది. ఎంతో ఆత్రుతంగా జరిగిన మ్యాచ్లో చాలా సునాయసంగా ఎడ్లగడ్డతండా జట్టు కట్టడి చేసి 34 పరుగుల తేడాతో డిసిసి జట్టును ఓడించి ఎడ్లగడ్డతండా జట్టు ట్రోపి విజేతగా నిలిచి కెప్టెన్ ప్రవీణ్ ఆదర్యంలో జట్టు ట్రోపితో పాటు 70 వేల రూపాయల నగదును అందుకున్నారు.
ఈ టోర్నమెంట్ తిలకించడానికి చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు యువకులు క్రికెట్ క్రీడాభిమానులు చేరుకొని సరదాగా మ్యాచ్ ను తిలకించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe