
ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి తీదేడు గ్రామ సర్పంచ్
Sekhar Reddy : చింత పల్లి జూన్ 03, త్రినేత్రం న్యూస్. తీదేడు గ్రామ అభివృద్ది కోసం కార్యదర్శి భాదిని అశోక్ సేవలు అభినందనీయమని గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.చింతపల్లి మండలం తీదేడు గ్రామ కార్యదర్శిగా గత 6 సంవత్సరాల 6 నెలల కాలం ఉత్తమ సేవలు అందించి బదిలీలో భాగంగా తక్కళ్లపల్లి గ్రామానికి కార్యదర్శిగా భాదిని అశోక్ బదిలీ కావడం జరిగిందని ఆమె తెలిపారు.తీదేడు గ్రామంలోని ప్రతి ఒక్కరితో స్నేహ పూర్వకంగా మెలుగుతు సేవలు అందించి అందరి మన్ననులు పొందడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్లు ఉలుపాల శేఖర్ రెడ్డి,ధరణిపతి రమణారావు, సోనగంటి గోవర్ధనాచారి, వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్, గంటెల అలివేలు సోమయ్య,శివర్ల పర్వతాలు యాదవ్, గ్రామస్తులు మర్రు రామారావు,సిమర్ల శ్రీను యాదవ్,బొడ్డు ఆంజనేయులు,వీరమల్ల జగదీష్,మర్రు శ్రీనివాస రావు,మర్రు రంగారావు,దాసరి మల్లయ్య,గంటెల చంద్రయ్య,రాశిక పాండయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
