Telangana Formation Day : తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS
Telangana Formation Day Celebrations

జాలే నరసింహారెడ్డి

Telangana Formation Day : చందంపేట జూన్ 02, త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని పోలేపల్లి క్రాస్ రోడ్డు లోని చిత్రియాల సహకార సంఘం సొసైటీ అధికారులు మరియు సిబ్బంది నిర్వహించిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో జాలే నరసింహారెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటారు అని అన్నారు.. అదే విధంగా దశాబ్దాల సుదీర్ఘ పోరాటాలు అమరవీరుల త్యాగాల ఫలితంగా 2014 జూన్ 2న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేకంగా అవతరించిందని తెలిపారు.. ఈ చారిత్రక దినం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు స్వయం పాలనకు ప్రతీక అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇప్ప తిరుపతి రెడ్డి, బందెల తిరుపతయ్య, వెంకులు, శ్రీను, రవి, మరియు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top