DOST : దోస్త్ రెండో విడతలో 52,302 మందికి సీట్లు

TRINETHRAM NEWS
second phase of DOST

నేటి నుంచి మూడో విడత ప్రారంభం

DOST : త్రినేత్రం న్యూస్ : దోస్త్రెండో విడత సీట్లను ఉన్నత విద్యామండలి శనివారం కేటాయించింది. ఈ విడత కింద కొత్తగా 46,504 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. తొలి విడతలో సీట్లు దక్కిన వారు కూడా మెరు గైన కళాశాల, కోర్సు కోసం ప్రయత్నించారు. వీరితో కలిపి మొత్తం రెండో విడతలో 60,439 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, 52,302 మంది సీట్లు పొందా రని కన్వీనర్ బాలకిష్టారెడ్డి తెలిపారు.

వారిలో అత్యధికంగా 21,431 మంది కామర్స్ విభాగంలో ప్రవేశాలు పొందారన్నారు. సీట్లు సాధించిన వారు ఈ నెల 31 నుంచి జూన్ 5 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీటును రిజర్వు చేసుకోవాలని సూచించారు.

మూడో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 31న ప్రారంభమవుతుంది. జూన్ 16 వరకు కొనసాగుతుంది. జూన్ 20న సీట్లు కేటాయిస్తారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top