New Timetable : ఎస్సీ గురుకుల సొసైటీలో కొత్త టైంటేబుల్‌

TRINETHRAM NEWS
New timetable in SC Gurukul

New Timetable : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్‌: ఎస్సీ సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల టైంటేబుల్‌ మారింది. గతంలో ఉదయం 8 నుంచి సాయంత్రం 4.30 వరకు ఉండగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు తరగతులు నిర్వహించేలా సొసైటీ మార్పులు చేసింది. ఈ మేరకు సొసైటీ ఇన్‌ఛార్జి కార్యదర్శి శారద ఆదేశాలు జారీ చేశారు.

టైంటేబుల్‌ మార్చినందుకు ఎస్సీ గురుకుల ఉపాధ్యాయులు, ఉద్యోగుల అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలరాజు, దయాకర్, ఎట్‌గ్రీవ అధ్యక్షుడు కూకుట్ల యాదయ్య, ఎస్సీ గురుకుల సంఘాల ఐకాస నాయకులు అంజయ్య, వెంకటేశ్వర్లు, బాలస్వామి, నర్సింహులుగౌడ్, సైదులు, సుధాకర్, మధుకర్, కీర్తిరవి, ఎస్‌.గణేష్, జోసెఫ్, మల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కలిసి ధన్యవాదాలు   తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top