
Hundi Donated : డిండి (గుండ్ల పల్లి) మే 20, త్రినేత్రం న్యూస్. హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి (NH-765) సమీపంలోని డిండి ప్రాజెక్ట్ లతీఫ్ పూర్ గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ కట్ట మైసమ్మ దేవత దేవస్థానానికి గుండ్లపల్లి (డిండి) గ్రామవాసి ప్రముఖ అడ్వకేట్ “బద్దెల సందీప్ యాదవ్” ఒక “హుండీని” విరాళంగా అందజేశారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం ఆయన ఈ హుండీని ఆలయ కమిటీ చైర్మన్ “ఎడ్ల నరేష్ యాదవ్” సమక్షంలో బహూకరించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ , డిండి సర్పంచ్ “నల్లగంతుల రవి” , మరియు పాలకమండలి సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి హుండీని విరాళంగా అందజేసిన దాత “బద్దెల సందీప్ యాదవ్ (అడ్వకేట్)” ని ఈ సందర్భంగా చైర్మన్, సర్పంచ్, పాలకమండలి సభ్యులు ఘనంగా సన్మానించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, భక్తులు మరియు ఆలయ అర్చకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

