Heavy Rain : తెలంగాణలో భారీ వర్షం

TRINETHRAM NEWS
Heavy rain in Telangana

Heavy Rain : త్రినేత్రం న్యూస్ : Mar 31, 2026, తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు మొదలయ్యాయి. కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

ఈ వర్షపు ప్రభావం క్రమంగా ఉత్తర తెలంగాణ నుంచి హైదరాబాద్ వైపు విస్తరిస్తోంది. హైదరాబాద్,మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో కూడా వాతావరణం మారిపోయంది. ఈదురుగాలులతో కూడిన వానలు పడే పరిస్థితి ఏర్పడింది. ఇక నల్గొండ ప్రాంతంలో కూడా వచ్చే రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top