
Welspun Foundation : త్రినేత్రం న్యూస్ /షాబాద్ ప్రతినిధి.. ఈ రోజు వెల్‌స్పన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కౌకుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ యువజన గ్రంథాలయంలో ఒక ముఖ్య కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బి. మల్లారెడ్డి హాజరై కార్యక్రమాన్ని నిర్వహించారు. వెల్‌స్పన్ ఫౌండేషన్ తెలంగాణ CSR హెడ్ సురేఖ వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. మొత్తం రెండు సెట్ల పుస్తకాలను అందించడం విశేషం.
ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ, యువత తమ సమయాన్ని సద్వినియోగం చేసుకొని పుస్తక పఠనానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఫోన్ల వినియోగం వల్ల సమయం వృథా కాకుండా, ఈ పుస్తకాలను ఉపయోగించుకొని వివిధ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధ్యక్షులు కృష్ణ , కౌకుంట్ల పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి సునీత, అలాగే వెల్‌స్పన్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ యువత కూడా పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమం గ్రామ యువతలో చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడమే కాకుండా, భవిష్యత్తులో మంచి అవకాశాల వైపు దారి చూపుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

