
Major Job Fair : త్రినేత్రం న్యూస్ : అమలాపురం, మార్చి 29 : డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఎంప్లాయిమెంట్ మరియు ‘వికాస’ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన (31/03/2026) రామచంద్రపురం నియోజకవర్గంలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు.
వేదిక: శ్రీనివాస శైల ఐటిఐ రామచంద్రపురం. అవకాశాలు: సుమారు 10 ప్రముఖ కంపెనీలలో 380కి పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. సమయం: ఉదయం నుండి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి.
ఈ సందర్భంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు మాట్లాడు తూ.జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చునన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

