
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరిన ఎంపీ అర్వింద్
Decisions on Railway Projects : త్రినేత్రం న్యూస్ : నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఉత్తర తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులపై ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొన్ని అంశాల్లో ఇంకా నిర్ణయాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో, ఆయన మరోసారి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు.
నిజామాబాద్ జంక్షన్‌లో పిట్ లైన్ మరియు కోచింగ్ డిపో ఏర్పాటు, పలు రైళ్ల పొడగింపులు అలాగే పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలకు ఆమోదం వంటి అంశాలు ప్రాంతీయ అభివృద్ధికి ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
అంతేగాకుండా నవీపేట్ , ఇందల్వాయి వద్ద అదనంగా ROBలు,డిచ్ పల్లి, అమ్మక్కపేట వద్ద RUBల నిర్మాణాల ప్రక్రియను వేగవంతం చేయాలని , జానకంపేట్ వద్ద RUB విస్తరణ, రైళ్ల పొడిగింపు, నిజామాబాద్, మెట్పల్లి, కోరుట్ల,జగిత్యాల, కరీంనగర్ మీదుగా తిరుపతికి రైళ్లు, నిజామాబాద్ మీదుగా వందే భారత్ ట్రైన్లను త్వరితగతిన అమలు కావాలని కోరారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని ఎంపీ అర్వింద్ రైల్వే మంత్రి ని కోరారు. కాగా తాను కోరినట్టుగా ఎడపల్లి వద్ద ఆర్ఓబి నిర్మాణం, డిచ్ పల్లి లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరు, ఆర్మూర్ -ఆదిలాబాద్ రైల్వే లైన్ పనుల మంజూరు పట్ల ఆయన రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news