Puducherry CM : పుదుచ్చేరి సీఎం ఆస్తులు ఎంతో తెలుసా?

TRINETHRAM NEWS
Do you know how much the Puducherry CM has

Puducherry CM : త్రినేత్రం న్యూస్ : పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామి తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. ఆయనకు మొత్తం రూ. 27.99 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన తట్టంచావడి, మంగళం నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు నిన్న నామినేషన్లు దాఖలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రంగస్వామి వద్ద 12 గ్రాముల బంగారు ఉంగరం, 12 గ్రాముల ముత్యాల హారం ఉన్నాయి. వీటితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. స్థిరాస్తుల విషయానికొస్తే, తట్టంచావడి మార్కెట్ ప్రాంతంలో రూ.8 కోట్ల విలువైన స్థలం, రెండు ఇళ్లు ఉన్నాయని తెలిపారు. ఇవి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తులని స్పష్టం చేశారు.

వివిధ సంస్థల్లో రూ.28 లక్షల పెట్టుబడులు ఉన్నాయని, అదే సమయంలో వ్యక్తిగతంగా ఇద్దరికి రూ.30 లక్షలు, రూ.5 లక్షల చొప్పున అప్పులు చెల్లించాల్సి ఉందని రంగసామి తన అఫిడవిట్‌లో పొందుపరిచారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top