Visit to Eidgah : రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గాహ్‌ల సందర్శన – బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష

TRINETHRAM NEWS
Visit to Eidgah on the occasion of Ramzan

Visit to Eidgah : త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి.. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు రంజాన్ పర్వదినం సందర్భంగా రేపు జరగనున్న ప్రార్థనలను దృష్టిలో ఉంచుకుని ఈద్గాహ్ ప్రాంగణాలను ఏసీపీ, సీఐ,ఎస్‌ఐ పోలీస్ అధికారులు సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సంబంధిత విభాగాల సిబ్బందితో కలిసి సమగ్రంగా పరిశీలించారు.ప్రార్థనలకు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని సూచించారు.ట్రాఫిక్ నియంత్రణ,పార్కింగ్ సదుపాయాలు, మహిళలు మరియు వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి శాంతియుతంగా పర్వదినాన్ని జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top