
Farewell Party : దేవరకొండ డివిజన్ మార్చ్ 18, త్రినేత్రం న్యూస్… దేవరకొండ పట్టణం లోని ఎం కే ఆర్ డిగ్రీ కళాశాలలో ఫేర్వెల్ పార్టీ కార్యక్రమం బుధవారం రోజు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ పున్నా శైలజ–వెంకటేశ్వర్లు& 7వ వార్డ్ కౌన్సిలర్ హనుమంతు సాయి చంద్ర గౌడ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు.
తమ విద్యాభ్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని జీవితంలో కొత్త దశలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగాలని, తమ ప్రతిభతో కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ లెక్చరర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

