Daughter Reveals Secret : నాన్నను అమ్మ చంపేసిందని కూతురు బయటపెట్టిన రహస్యం

TRINETHRAM NEWS
Daughter reveals secret

Daughter Reveals Secret : భర్తను హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించిన భార్య – ప్రియుడి సహాయంతో దిండు పెట్టి చంపి మద్యం ఫలితంగా చూపించిన ఖతిజా . భద్రాద్రి కొత్తగూడెం జిల్లలో దారుణ హత్య కేసు

త్రినేత్రం న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో సెంట్రింగ్ కూలీగా పని చేస్తున్న ఎస్‌డీ. జాఫర్‌ను అతని స్వస్థలం చింతలపూడిలోనే భార్య ఖతిజా హత్య చేసింది. 13 ఏళ్ల క్రితం ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామానికి చెందిన ఖతిజాను వివాహం చేసుకున్న జాఫర్, పదేళ్లు తిప్పనపల్లిలో నివసించి గత మూడేళ్లుగా చింతలపూడిలో ఉన్నాడు.

వీరి కుమారుడు హాస్టల్‌లో చదువుతున్నాడు. ఎనిమిదేళ్ల కూతురు తల్లిదండ్రులతోనే ఉండేది. చింతలపూడి వాసి మీరాతో ఖతిజాకు వివాహేతర సంబంధం ఏర్పడటంతో దంపతుల మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. ఆరు నెలల క్రితం తిప్పనపల్లికి తిరిగి వచ్చినప్పటికీ, ఖతిజా మీరాతో రహస్యంగా మాట్లాడుతూ ఉండటం జాఫర్‌కు తెలిసి, గత పది రోజులుగా ఆమెతో తీవ్ర గొడవలు జరిగాయి.

అక్రమ సంబంధానికి అడ్డుకట్టిన భర్తను హత్య… తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా తొలగించాలని నిర్ణయించుకున్న ఖతిజా, ప్రియుడి సహాయంతో జాఫర్ నిద్రపోతున్నప్పుడు మొహంపై దిండు పెట్టి హత్య చేసింది. “మద్యం సేవించి కింద పడి గాయపడ్డాడు, తెల్లవారుజామున చనిపోయాడు” అని అందరినీ నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేయించింది.

అంత్యక్రియల తర్వాత కూతురితో మాట్లాడుతుండగా, “నాన్నను అమ్మ, ఇంకో వ్యక్తి కలిసి చంపేశారు” అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఈ సమాచారంతో కుటుంబ సభ్యులు ఖతిజాను చితకబాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తు.. నిందితురాలి అరెస్టు… కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చింతలపూడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆధారాలు సేకరించి ఖతిజాను అరెస్టు చేశారు.

You cannot copy content of this page

Scroll to Top