విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ.
ఆల్ఫా మోడల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు : భారతి.
డిండి (గుండ్ల పల్లి) మార్చ్ 12, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రములో ఆల్ఫా మోడల్ పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులు అయి చక్కటి ఉపాధ్యాయ విధులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలు,బాధ్యతలు నేడు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులకు అవగాహన అవుతాయని తెలిపారు.స్వపరిపాలన దినోత్సవం విద్యార్థులకు తీపి జ్ఞాపకాలను మిగులుస్తుందని పేర్కొన్నారు, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించి పాఠశాలకు, పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల భవిషత్తుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తల్లిదండ్రులకు సూచించారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు.స్వపరిపాలన కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖమంత్రి గా వి తమన్ శాసన సభ్యులుగా ఎ ఆద్య, జిల్లా పరిపాలనధికారి (కలెక్టర్) గా నూర్-ఉల్- హుదా జిల్లా విద్యాధికారిగా కె. భవిత తహసీల్దార్ గా ఆర్.మోహిత్ మండల విద్యాధికారిగా ఎం. భువనేశ్వరి, కరెస్పాండెంట్ గా మహమ్మద్ అబ్దుల్ అహమద్ రజా ప్రధానోపాధ్యాయులుగా జి. అశ్విత ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులను అభినందించి జ్ఞాపికలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం ప్రకాష్, సినీ, లింగమయ్య, భార్గవి, మహర్జన, పూజ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


