జూన్ 27, 2026
TRINETHRAM NEWS

Ponguleti : త్రినేత్రం న్యూస్ : Mar 11, 2026, తెలంగాణ : ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ వ్యవహారంలో ఇచ్చిన హామీ ప్రకారం నిజమైన లబ్దిదారులను గుర్తించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

అర్హులైన పేదలను గుర్తించి మొత్తం 412 మందికి లబ్ధి కల్పిస్తున్నామన్నారు. ఇందులో 311 మందికి ఇళ్ల స్థలాలు, మరో 101 మందికి వారి గ్రామాల్లో ఉన్న సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణం కోసం సహాయం అందిస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి పేదవాడికీ న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వ కట్టుబడి ఉందన్నారు.

Ponguleti

You cannot copy content of this page