Trinethram News : 132 – జీడిమెట్ల డివిజన్ జీడిమెట్ల గ్రామానికి చెందిన కుమ్మరి లలిత (54) భర్త కృష్ణ అనారోగ్యం బాధపడుతున్న విషయాన్ని స్థానిక బిఆర్ఎస్ నాయకులు కాలే గణేష్, బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి లబ్ధిదారురాలు లలితకు రూ.1,00,000/- (లక్ష రూపాయలు) మంజూరు చేయించగా నేడు జీడిమెట్ల డివిజన్ కు చెందిన బిఆర్ఎస్ నాయకులు లబ్ధిదారురాలు కుటుంబసభ్యులకు ఈరోజు చింతల్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎల్వోసీ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… కుత్బుల్లాపూర్ ప్రజల ఆపద్బాంధవులు మా నాయకులు, బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అని అన్నారు. ఆర్థికంగా సతమతమవుతూ మెరుగైన వైద్యం కోసం ఎదురుచూసే ప్రతీ ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో కుంట సిద్ధిరాములు, నరేందర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నార్లకంటి కుమార్, ఆటో బలరాం, బాల మల్లేష్, జయం చారి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


