జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు 1465 మద్యం బాటిల్స్ ను ధ్వంసం చేసిన పోలీస్ అధికారులు
Trinethram News : బాపట్ల జిల్లా సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 13 కేసులలో సీజ్ చెయ్యబడిన 1465 మద్యం బాటిల్స్ ను కోర్టు ఉత్తరుల మేరకు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో బాపట్ల డిఎస్పీ టి.వెంకటేశులు ఆధ్వర్యంలో మధ్యవర్తుల సమక్షంలో జనవరి 27న శనివారం సంతమాగులూరు పాత పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్ రోలర్ ద్వారా ధ్వంసం చెయ్యడం జరిగింది.వీటి విలువ సుమారు రూ. 90,000/- ఉంటుందని డిఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ తో పాటు సంతమాగులూరు సీఐ, సర్కిల్ ఎస్.ఐ లు పాల్గొన్నారు.