Traffic Diversion : సీఎం బహిరంగ సభ సందర్బంగా ట్రాఫిక్ మళ్లీంపు. – జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర

TRINETHRAM NEWS

త్రినేతం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిది… శనివారం, ఫిబ్రవరి 7 రోజున ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బహిరంగ సభను పురస్కరించుకొని దోమ మండల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, తెలిపారు.

సభకు వచ్చే రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఉదయం 9:00 నుండి రాత్రి 7:00 గంటల వరకు తిమ్మాయపల్లి – ఊట్పల్లి మీదుగా పరిగికి వెళ్లే ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో దోమ నుండి పరిగి మరియు గడిసింగపూర్ వైపు వెళ్లే ప్రయాణికులు బాస్ పల్లి, బొంపల్లి మీదుగా ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు.

అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా, భద్రతా కారణాల దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయానికి వాహనదారులు మరియు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ తెలియజేయడం జరిగింది. పరిగి నుండి దోమ వెళ్లే వారు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలని ఎస్పీ కోరడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Traffic diversion on the occasion of CM's public meeting

You cannot copy content of this page

Scroll to Top