అరకులోయ జనవరి 5, (త్రినేత్రంన్యూస్): అరకు నియోజకవర్గ పరిధిలోని అరకు మండలం లిట్టిగూడ గ్రామంలో భూముల రీ-సర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఎటువంటి తప్పులు లేని, రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను 36 మంది రైతులకు బుధవారం ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ రీ-సర్వే వల్ల భూ వివాదాలకు ముగింపు పలుకుతుందని, రైతులకు పారదర్శకమైన రికార్డులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం రైతులకు వెంటనే ఈ-కేవైసీ ప్రక్రియను నిర్వహించారు.
కార్యక్రమంలో ఆర్డీఓ ఎంవిఎస్ లోకేశ్వరరావు, ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ చైర్మన్ దొన్ను దొర, సర్పంచ్ దాసు బాబు, తహసీల్దార్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


