తాడేపల్లి
ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న బిజెపి,నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సాగనంపండి.
ఎంసూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు.
బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్, బైకు ర్యాలీ.
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మికుల కర్షకుల హక్కులను కాలరాస్తున్న,కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లి ప్రాతూరు క్రాస్ రోడ్డు వద్ద బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ట్రాక్టర్, బైక్ ర్యాలీ ని సూర్యనారాయణ ఏ ఐ కె ఎస్ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఒకవైపున పెట్రోల్ డీజిల్, గ్యాస్, ధరలను విపరీతంగా పెంచేసి, ప్రజల నెత్తిన భారాలు వేయడమే కాక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. అందులో భాగంగానే దేశ సంపదను అంబానీ, అదాని వంటి కార్పోరేట్ శక్తులకు కారు చౌకగా దోచిపెడుతుందని ఆయన విమర్శించారు. నరేంద్ర మోడీ పరిపాలనలో కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు కల్పించిన నరేంద్ర మోడీ రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కార్మికుల హక్కులను కాల రాశారని ఆయన మండిపడ్డారు. అదా నీ అంబానీలను కుబేరులను చేసి, రైతులను వ్యవసాయ కార్మికులను అప్పులు పాలు చేశారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే మూడు నల్ల చట్టాలు తీసుకువచ్చారని అన్నారు. అదేవిధంగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చారన్నారు. అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. నిరంకుశ పరిపాలన సాగిస్తున్న కేంద్ర బిజెపి, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని గద్దించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఏకం అవ్వాలని అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు సీ టు 50 శాతం ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలని, కేరళ రాష్ట్ర విధానాన్ని అమలు చేయాలని అన్నారు. రైతుల రుణాలు మాఫీ చేసేందుకు రుణ ఉపశమన చట్టాన్ని చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వంకాయలపాటి శివనాగ రాణి మాట్లాడుతూ ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. ఉపాధి కూలీలకు 200 పని దినాలు పెంచి, వేతనం 600 రూపాయలు ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా ఆన్లైన్ మస్టర్ విధానాన్ని రద్దు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా నాయకులు ఎస్ ఎస్ చెంగయ్య మాట్లాడుతూ కార్మికుల పొట్ట కొట్టే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటు కరణ నిలుపుదల చేసి, కడప ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు మాట్లాడుతూ కరువు తుఫాన్ నష్టపరిహారాలను ఇన్పుట్ సబ్సిడీలను రైతులకు వెంటనే ఇవ్వాలని, రైతులందరికీ పంటల బీమా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా సాగులో ఉన్న కౌలు రైతులకే, నష్టపరిహారాలు బీమా సౌకర్యం ఇవ్వాలన్నారు. అంతేకాకుండా విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించి, స్మార్ట్ మీటర్ల బిగించే విధానాన్ని నిలుపుదల చేయాలన్నారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించి, నిర్వాసితులకు పూర్తి పునరావసం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ట్రాక్టర్, బైక్ ర్యాలీలో కార్మికులు, రైతులు తమ వాహనాలకు ఏఐకేఎస్, సిఐటియు, ఏఐటీయూసీ జెండాలు కట్టుకొని, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుంచనపల్లి, ప్రాతూరు, గుండి మెడ, చిర్రావూరు, మెల్లెంపూడి, ఇప్పటం వడ్డేశ్వరం, కొలనుకొండ, తాడేపల్లి తదితర గ్రామాలలో ట్రాక్టర్, బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి.శివ నాగరాణి, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ, సిఐటియు నాయకులు ఎస్ఎస్ చేంగయ్య, మహిళా సంఘం నాయకురాలు ఎన్.భారతి,
ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు
ముసునూరు సుహాస్,గౌరవ అధ్యక్షులు గుంటక సాంబిరెడ్డి, ఏఐటీయూసీ నాయకులు తుడి మెల్ల వెంకటయ్య,గుంటూరు పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు
కళ్ళం రాజశేఖర్ రెడ్డి,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడేపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు మోదుగుల శ్రీనివాసరెడ్డి,కాజా వెంకటేశ్వరరావు, రైతు నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి,అమ్మిశెట్టి రంగారావు, డోకిపర్తి రాజేంద్ర బాబు, గోపాల్ రావు,రాజధాని రైతు సంఘం నాయకులు కొర్రపోలు ఈశ్వరరెడ్డి, ఎస్.కె ఎర్ర ఫీరు, సిఐటియు నాయకులు డి విజయభాస్కర రెడ్డి, కంప వెంకటయ్య, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు ఆర్ వి రాఘవయ్య, వై బర్నబాస్, టి బక్కిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.