- రొయ్యపిల్ల ల పంపిణీ లో అవకతవకలు.
- కాంట్రాక్టర్ తో అధికారులు, అధికారులతో మత్స్యకార సొసైటీ కుమ్మక్కు.
- ప్రభుత్వ నిధులుదుర్వినియోగం.
- ఈవిషయం పైజిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేస్తాను.
- డిండి సర్పంచ్ :— నల్లగంతుల రవి.
దేవరకొండ డివిజన్ జనవరి 29 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య కార్మికులకు జీవనోపాధి కల్పించాలని ఉద్దేశంతో చెరువుల్లో, చిన్న చిన్న కుంటలలో చేప పిల్లలను, రొయ్య పిల్లలని విడుదల చేసే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది.
కానీ దీనిలో కొంతమంది అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాసిరకం ను , అధికారలెక్కలకంటే చాలతక్కువగా విడుదల చేస్తూ , మత్స్యకార సొసైటీ సభ్యులతో కలిసి చేతివాటం ప్రదర్శిస్తున్నారని ప్రధానంగా వినిపిస్తున్న మాట అనిమత్స్యకార్మికులుఆవేదన చెందు తున్నారు.
డిండి ప్రాజెక్టు లో రొయ్య పిల్లలను విడుదల చేసేందుకు అధికారులు తమసిబ్బంది తో రెండు డీ సి ఎం వాహనాలు తీసుకొని ప్రాజెక్టు వద్దకి వచ్చారు. అధికారి మాట్లాడుతూ నీలకంఠ రొయ్య పీ ఎల్ 20 రకం 5 లక్షల పిల్లలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు , స్థానిక మత్స్య కారులు , డిండి సర్పంచ్ రవి అనుమానం వచ్చి రొయ్య పిల్లలను లెక్క పెట్టాలని పట్టుపట్టారు.
చేసేదేమీ లేక అధికారి లెక్కపెట్టాల్సిందిగా సిబ్బందికి తెలిపారు.తీరాలెక్కపెడితే 15 వేల రొయ్య పిల్లలు మాత్రమే వున్నాయి. జిల్లా అధికారినిఇండెంట్ వివరాలుచూపాలనికోరినప్పటికీఆయనదాటవేశారు. చేసేదేమీలేక ఎంతలెక్కవస్తేఅంతరాసుకుంటామని తెలిపారు. ఎం ఎస్ ఆర్ ఆచరీస్ కాకినాడ నుంచి పిల్లలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. రొయ్యపిల్లలులెక్కింపులోమత్స్యశాఖ సహకరించడం లేదని మత్స్య కారులు తెలిపారు.
కొన్నేళ్లుగా డిండి రిజర్వాయర్ లో విడుదల చేసే చేప ,రొయ్య పిల్లల పంపిణీ లో అధికారులు చెప్పేదానికి , పంపిణీ చేసేదానికి పొంతన వుండటంలేదని తప్పుడు లెక్కలు చెప్పి మత్స్య కార్మికులను దగాచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
దీనిపై జిల్లా మత్స్య శాఖ అధికారిని వివరణ కోరగా సొసైటీ చైర్మన్ ఎంత చెబితే అంతే రాసుకొండని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని, నాసిరకం చేప పిల్లలు రొయ్య పిల్లలను విడుదల చేస్తూ మత్స్యకారులను మోసం చేస్తున్నారని, దీనిపై జిల్లా పరిపాలన అధికారి(కలెక్టర్ )కు పిర్యాదు చేయబోతున్నట్లు డిండి సర్పంచ్ నల్లగంతుల రవి తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


