భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఒక దేశానికి రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజుని ఆ దేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే “జాతీయ పండుగ”నే గణతంత్ర దినోత్సవం.
భారతదేశంలో 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమలులోకి వచ్చిన కారణంగా “గణతంత్ర దినోత్సవం” ను గౌరవంగా జరుపు కుంటారు.
ప్రజలందరికీ స్వేచ్ఛ,సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి జీవన విధానాన్ని ఓ సరైన మార్గంలో నడిపించుటకే మొదట్లో భారత్‌ను సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొన్నారు.
అయితే 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా ఇది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మారింది.
భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది.