త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట..అశ్వారావుపేట మండలంలో పులి సంచారం… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలోని కావడి గుండ్ల గ్రామం మరియు చుట్టుపక్కల గ్రామ ప్రాంతాల్లో, పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల గ్రామ సమీప అటవీ ప్రాంతంలో పులి ఆవుల పై దాడి చేసినట్లు మరియు పులి అడుగుజాడలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో,ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని పోలీసు అధికారులు సూచించారు. పశువులను మేతకు తీసుకెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే వారు అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా,పులి కదలికలపై నిఘా పెంచినట్లు తెలిపారు. ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


