వికారాబాద్ జిల్లా ప్రతి నిధి త్రినేత్రం న్యూస్… కోడంగల్‌లో మెగా హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐ పి స్ పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఆరోగ్యం శాఖకు, వారి కుటుంబానికి ఎంతో విలువైనదని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీస్ తెలిపినారు.
కేవలం జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా, అన్నీ పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహించే సిబ్బందికి కూడా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతో, జిల్లా పోలీస్ యంత్రాంగం మరియు జిల్లా పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పరిగి సబ్ డివిజన్ మరియు తాండూర్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు, హోం గార్డ్స్ అధికారులకు కోడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన “మెగా ఉచిత వైద్య శిబిరాన్ని” ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
నిన్న జిల్లా కార్యాలయంలో జరిగిన శిబిరానికి కొనసాగింపుగా 2వ రోజు పరిగి,తాండూర్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది, అధికారులు, హోం గార్డులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులైన యశోద, మ్యాక్స్ విషన్, సాయి డెంటల్ మరియు ప్రభుత్వ వైద్య నిపుణులను నేరుగా కోడంగల్ తీసుకువచ్చి, సిబ్బందికి జనరల్ చెకప్,ఇఏంటీ కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, కంటి మరియు దంత వైద్య పరీక్షలను అత్యాధునిక పరికరాలతో నిర్వహించారు.
శిబిరాన్ని సందర్శించి, వైద్య పరీక్షలు చేయించుకుంటున్న సిబ్బందితో ఎస్పీ మాట్లాడినారు. అనంతరం ఎస్పీ ఇట్టి కార్యక్రమం లో మాట్లాడుతూ “పోలీసుల జీవితం నిత్యం సవాళ్లతో, సమయాభావంతో కూడుకున్నది. ఈ క్రమంలో చాలామంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.
చిన్న చిన్న అనారోగ్య సమస్యలే భవిష్యత్తులో పెద్ద ముప్పుగా మారకముందే, ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. క్షేత్ర స్థాయిలో పనిచేసే కానిస్టేబుల్ నుండి అధికారి వరకు అందరూ శారీరకంగా, మానసికంగ దృఢంగా ఉంటేనే ప్రజలకు మరింత మెరుగైన సేవలందించగలరు” అని తెలిపినారు. సిబ్బంది సంక్షేమం కోసం ఎల్లప్పుడు ముందు వరసలో ఉంటాము అని జిల్లా ఎస్పీ ఇట్టి కార్యక్రమం సంధార్బంగా తెలియజేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమం లో ఈసిజి ఈసీజీ, 2D ఎకో, రాండమ్ బ్లడ్ షుగర్ ఆర్ బి ఎస్, బీపీ, బిఎంఐ వంటి నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. మరియు అవసరమైన వారికి ఉచిత మందుల పంపిణీతో పాటు, తదుపరి చికిత్స కోసం స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా రిఫరల్ సౌకర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్,డిప్యూటీ DMHO రవీందర్ రెడ్డి, పరిగి డీఎస్పీ శ్రీనివాస్,తాండూర్ డీఎస్పీ యాదయ్య,పరిగి సీఐ శ్రీనివాస్ రెడ్డి, కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి , తాండూర్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, కరణ్ కోట్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, కొడంగల్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చంద్ర ప్రియా, జిల్లా పోలీస్ ప్రసిడెంట్ ఆశోక్, పరిగి, కొడంగల్ డివిజన్ ల ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, హోం గార్డ్స్ అధికారులు, మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వైద్య సేవలు అందించిన డాక్టర్లు వెంకటేష్, సంజయ్ వివేక్, డ్రగ్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, డ్రగిస్ట్ & కెమిస్ట్ ఇంచార్జ్ శ్రీనివాస్ మరియు వారి బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా సత్కరించారు. తమ కుటుంబాల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు పోలీస్ సిబ్బంది ఎస్పీ కి కృతజ్ఞతలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


