Trinethram News : కూకట్పల్లి జనవరి 19 (త్రినేత్రం న్యూస్) : “ఎలా ఉందో ఫతేనగర అలానే ఉంది ఫతేనగర్” అనే నినాదంతో ప్రజా సమస్యలపై ముందుకు సాగుతున్న బీజేపీ నాయకుడు కాంచీ మహేందర్ నాయకత్వంలో ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ వైఫల్యాలకు నిరసనగా దిష్టి బొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు.
ఫతేనగర్‌లో నెలకొన్న మౌలిక సదుపాయాల లోపాలు, అభివృద్ధి పనులలో నిర్లక్ష్యం, ప్రజా సమస్యలపై కార్పొరేటర్ స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా కాంచీ మహేందర్ మాట్లాడుతూ ఫతేనగర్ అభివృద్ధి విషయంలో పాలకుల వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా తాము నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు బాలేష్, శివ, ప్రమోద్, సురేష్, ఉష, రేవప, అరవింద్, రవి, రమేష్, గుప్తా, నాగేష్, దుర్గాప్రసాద్, వినీత్, దినేష్, రాకేష్, రఘు, శ్రీనివాస్, దశరథ్‌తో పాటు పలువురు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.ఫతేనగర్ ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాటం మరింత ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా వెల్లడించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


