BRS Party Meeting : బీ ఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ జనవరి 18 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన దేవరకొండ మున్సిపాలిటీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…..మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు.పట్టణ ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని, రెండు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఏ పట్టణానికి చెల్లించని ఏకైక ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు.

పారిశుద్ధ్యం నుంచి ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఒకవైపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెడుతూ మరోవైపు పట్టణాలను పడుకోబెట్టి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందన్నారు అని ఆయన అడిగారు.

ఈ రెండు సంవత్సరాల్లో ఆయా పట్టణాలకు చేసిన అభివృద్ధి, ఇచ్చిన నిధులు వివరించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ నేతలకు ఆయన సవాల్ చేశారు.పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను తట్టుకొని మంచి ఫలితాలు సాధించామని, అదే స్పూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.

కలిసికట్టుగా పోరాడి ఎన్నికల్లో మంచి విజయం నమోదు చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు కేతావత్ బిల్యా నాయక్, నేనావత్ కిషన్ నాయక్, వడత్య రమేష్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు టీ వీ ఎన్ రెడ్డి, పల్లా ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS Party Chief Activists Meeting

You cannot copy content of this page

Scroll to Top