”పార్టీలు వేరైనా మన లక్ష్యం ఒక్కటే.. ‘దేవరకొండ జిల్లా’ – దశాబ్దాల వెనుకబాటుకు చరమగీతం పాడుదాం!” బాబు రామ్ నాయక్.
దేవరకొండ డివిజన్ జనవరి 18 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గ గడ్డపై ఒక నవశకం మొదలుకాబోతోంది. భౌగోళికంగా ఎంతో పెద్దదైన, సామాజికంగా వెనుకబడిన మన ప్రాంతం స్వయంపాలనలో మాత్రమే అభివృద్ధి చెందుతుంది. గిరిజనులు, హరిజనులు, వెనుకబడిన తరగతులు మరియు మైనారిటీల ఆకాంక్షలకు ప్రతిరూపమైన “దేవరకొండ జిల్లా” సాధనే ఏకైక ఎజెండాగా రేపు (సోమవారం) మనమంతా గళం విప్పబోతున్నామని సమాచార హక్కు సేవా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు దేవరకొండ జిల్లా సాధన సమితి కమిటీ సభ్యులు బాబురామ్ నాయక్ ప్రకటించారు.
రాజకీయాలకు అతీతంగా.. ఐక్యతకు ప్రతీకగా: ఇది ఏ ఒక్క పార్టీకో, వ్యక్తులకో సంబంధించిన పోరాటం కాదు. ఇది మనందరి ఉమ్మడి బాధ్యత. అందుకే, మనమంతా జెండాలు పక్కన పెట్టి.. ఎజెండా ఒక్కటే చేసుకొని ముందుకు సాగాలని ఆయన కోరారు.
రాబోయే పోరాట కార్యాచరణను ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రావాలని ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆహ్వానిస్తున్నాము: అని అన్నారు.
రాజకీయ పక్షాలు: అన్ని పార్టీల నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు మరియు కార్యకర్తలు. సంఘాలు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు అన్ని కుల సంఘాల ప్రతినిధులు.
ఉద్యోగ & మేధావుల వర్గం: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు.
యువత: విద్యార్థి, యువజన సంఘాల నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


