Welcome to CM Cup : సి ఎం కప్ 2025- 26 టార్చ్ ర్యాలీకి స్వాగతం

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ జనవరి 16 త్రినేత్రం న్యూస్. చీఫ్ మినిస్టర్ కప్ 2025-26 టార్చ్ ర్యాలీకి శుక్రవారం రోజు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో , అధ్యక్షుడు ఎన్ వీ టీ మరియు సభ్యులు స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన సీ ఐ వెంకట్ రెడ్డి ,అక్బర్ అలీ , అధ్యక్షుడు ఎన్ వీ టీ తో కలసి టార్చ్ లైట్ ని వెలిగించి దేవరకొండ టౌన్ లో ర్యాలీని ప్రారంభించినారు. అనంతరం వారితో పాటు ర్యాలీలో పాల్గొన్నారు.

అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లి ఆయన విగ్రహానికి పూలమాల లేసి నివాళులర్పించినారు, సి ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్క క్రీడాకారుడు ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాలని, దేవరకొండ నియోజకవర్గంలో అన్ని క్రీడలలో ప్రతిభ గలిగిన క్రీడాకారులు ఉన్నారని అన్నారు.

అధ్యక్షుడు ఎన్ వీ టీ మాట్లాడుతూ మండలం అనంతరం జిల్లా అనంతరం రాష్ట్రస్థాయి లో పాల్గొని ఆడడానికి ఇది ఒక మంచి అవకాశం అని మండలాలలో ఉన్న క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఈ ప్రయత్న అని అన్నారు.

జనవరి 17 , 22 వరకు గ్రామపంచాయతీ లెవల్,28 ,31 వరకు మండల్ అర్బన్ రూరల్ లెవెల్, ఫిబ్రవరి 3 , 7 వరకు అసెంబ్లీ కాంసెన్సీ లెవెల్, 10 , 14 వరకు డిస్టిక్ లెవెల్, 19 ,26 వరకు స్టేట్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ జరుగుతాయని అన్నారు కాబట్టి ప్రతి ఒక్క క్రీడాకారుడు యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారి యొక్క ప్రతిభను కనపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Welcome to CM Cup 2025- 26 Torch Rally

You cannot copy content of this page

Scroll to Top