దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్.
దేవరకొండ డివిజన్ జనవరి 13 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం తూర్పుపల్లి(బొడ్డు పల్లి) లోని కోమటి తండ లో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠలో బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతనతో ఉండాలని అయన పేర్కొన్నారు. అనంతరం నేనావత్ కిషన్ నాయక్ ను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.
వారితో పాటు జై రామ్ గురుస్వామి, స్థానిక సర్పంచ్ వెంకటేశ్వరరావు, తిర్మల్ రావు, 3వ వార్డ్ కెశ్య, శంకర్, బాలు, గణేష్,రమేష్ నాయక్, నర్సింహ, సంతోష్, రమేష్ భక్తులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


